News March 24, 2024
గుంటూరు: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన దొప్పలపూడి రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దొప్పలపూడి రాజేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన మృతికి ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోటు రాసి మరణించాడు.
Similar News
News December 10, 2025
GNT: సీఐపై నిందారోపణ కేసులో ట్విస్ట్

సీఐ తనపై దాడి చేయించారంటూ నిందలు మోపిన జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు సహా మరో ఇద్దరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీలను పెట్టుకుని తన కారును తానే ధ్వంసం చేయించి, పోలీసులపై అబద్ధపు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. విజయవాడ బస్టాండ్ వద్ద అరుణ్ బాబు, పొంగులూరి అన్వేష్, కారుకుట్ల సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 10, 2025
గుంటూరు జిల్లాలో 4.78 లక్షల సంతకాలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ముగిసింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి మొత్తం 4,78,000 సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
News December 10, 2025
మంగళగిరి ఎయిమ్స్‌లో 30 లక్షలు దాటిన వైద్య సేవలు

మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో మైలురాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 30 లక్షల మందికి సేవలు అందించినట్లు బుధవారం వెల్లడించారు. గత ఆరు నెలల్లోనే 5 లక్షల ఓపీ నమోదైందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.


