News January 5, 2025
గుంటూరు: పోలీసులమని బెదిరించి.. బట్టలు విప్పించి..
పోలీసులమని బెదిరించి ఓ వ్యక్తితో దుస్తులు ఇప్పించడంతో పాటూ నగదు దోచుకున్న ఘటన నగరంపాలెం స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని ఆపి మెడికల్ కాలేజ్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పించారు. జేబులో మత్తుపదార్థాలున్నాయి, కేసు నమోదు చేస్తామని బెదిరించారు. బాధితుడి వద్ద ఫోన్ లేకపోవడంతో అతని సోదరుడికి ఫోన్ చేయించి ఐదు వేలు కొట్టించుకున్నారు.
Similar News
News January 7, 2025
GNT: జిల్లాలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.?
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్‌పై అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News January 7, 2025
వృద్దులు, మహిళలకు ఫిర్యాదులపై శ్రద్ధ: ఎస్పీ
వృద్దులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల శ్రద్ధ వహించి, చట్ట పరిధిలో వారి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సూచించారు. సోమవారం, జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జనార్ధనరావు, రమేశ్, మురళీ కృష్ణ, PGRS సీఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News January 6, 2025
8న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు: DEO
గుంటూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న “రంగోత్సవ్” జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జూనియర్ కళాశాలల విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్‌లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. 8 అంశాల్లో పోటీలు జరుగుతాయని, dietboyapalemguntur@gmail.comలో సంప్రదించాలన్నారు.