News August 13, 2025
గుంటూరు ప్రజలకు కమిషనర్ సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. బుధవారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తాగునీటి సమస్యలు, చెట్లు విరిగి ట్రాఫిక్‌కి అడ్డుగా ఉన్నా, వర్షం నీరు నిలిచినా 08632345103, 104,105 నంబర్‌లకు సమాచారం అందించాలని చెప్పారు.
Similar News
News August 13, 2025
గుంటూరు చరిత్రలో మర్చిపోలేని PHOTO ఇది

బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే గుంటూరులో 1947 ఆగస్టు 15వ తేదీన ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించారు. స్థానిక AC కళాశాలలో అదే రోజు జెండా ఎగురవేశారు. AC కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ నారాయణ తన మాటలతో ప్రజలను ఉత్సహ పరిచరారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు. ప్రముఖ వ్యక్తులు ప్రసంగించారు. పైన ఉన్నది అప్పటి ఫొటోనే.
News August 13, 2025
గుంటూరు జిల్లాలో వేల ఎకరాలకు నష్టం: YCP

గుంటూరు జిల్లాలో వేల ఎకరాలు నీట మునిగాయని వైసీపీ ఆరోపిస్తుంది. ‘పెదకాకాని మండలం గొల్లమూడి సమీపంలో గుంటూరు ఛానల్ కాలువకు గండి పడినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. గండి పడే అవకాశం ఉందని రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు కంటితుడుపుగా మరమ్మతులు చేసి వదిలేశారు. పంట నష్టపోయిన రైతు కన్నీటికి కారణం నీ నిర్లక్ష్యం కాదా చంద్రబాబు?’ అని ప్రశ్నిస్తూ YCP ట్వీట్ చేసింది.
News August 13, 2025
తెనాలితో గాంధీ మహాత్మునికి ప్రత్యేక అనుబంధం

స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా గాంధీజీ 3సార్లు తెనాలి వచ్చారు. 1929లో తొలిసారి తెనాలి వచ్చి పట్టణ నడిబొడ్డున సభలో ప్రసంగించారు. అందుకే ఆ ప్రాంతానికి గాంధీచౌక్‌గా నామకరణం చేశారు. 1933లో 2వ సారి వచ్చి రైల్వే స్టేషన్ పడమర వైపున బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చెంచుపేటలోని ఇప్పటి శబరి ఆశ్రమాన్ని ప్రారంభించి రాత్రికి ఐతనగర్లో బస చేశారు. 1946లో 3వసారి మద్రాస్ వెళుతూ రైల్వే స్టేషన్లో సేద తీరారు.