News March 19, 2024
గుంటూరు: ప్రతి రోజూ గుండె జబ్బుల ఓపీ సేవలకు ఏర్పాట్లు

జీజీహెచ్‌లో ప్రతి రోజూ గుండె జబ్బుల ఓపీ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. సోమవారం ఆసుపత్రిలోని క్షయ నియంత్రణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. గుండె జబ్బుల ఓపీ సేవలు వారంలో 3 రోజులు మాత్రమే ఉన్నాయని, గుండె జబ్బుతో బాధపడే రోగులు రోజుకు 200 మంది వస్తుండటం వల్ల ప్రత్యేక ఓపీ సేవలు కేటాయించామన్నారు.
Similar News
News February 24, 2026
గుంటూరు: ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ.. నిందితులు వీరే..!

MLA ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. నిందితుల నుంచి 10కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు రికవరీ చేశామన్నారు. సత్తెనపల్లి రాకేష్, కొక్కిలిగడ్డ ఆశీర్వాదం దొంగతనానికి పాల్పడ్డారని, వీరిపై గతంలో 34కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 8మంది నిందితులను గుర్తించి, ఐదుగురిని అరెస్ట్ చేసామన్నారు.
News February 24, 2026
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారీ తనిఖీల్లో భాగంగా గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన తాళాల సీల్, సీసీ కెమెరాల డిస్‌ప్లే, ప్రాంగణాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News February 24, 2026
ప్రైవేటుకు దీటుగా జూనియర్ కాలేజీలు: లోకేశ్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. వీటిని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్‌లో మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు ఇస్తోందన్నారు. త్వరలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, పోటీ పరీక్షల మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.


