News March 28, 2024
గుంటూరు: ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గానూ 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Similar News
News October 25, 2025
అవాస్తవ, ద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవ ప్రచారాలు, ద్వేషపూరిత పోస్టులు, వీడియోలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం జూమ్ ద్వారా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, విదేశాల్లో ఉన్న నిందితులపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద పోస్టులు గమనిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.
News October 24, 2025
పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.
News October 24, 2025
ANU: ‘ఇన్‌ఛార్జ్ వీసీ సాధారణ విధులను మాత్రమే నిర్వర్తిస్తారు’

ANU ఇన్‌ఛార్జ్ VC సాధారణ విధులను మాత్రమే నిర్వర్తిస్తారని, జీతాల పంపిణీ మినహా కాంట్రాక్టర్లకు చెల్లింపులు, కొత్త నియామకాలు, సిబ్బందిని క్రమబద్ధీకరించడం వంటి విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ANU ఇన్‌ఛార్జ్ VCకి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీలో ఖర్చులకు ‘మించి’ బిల్లులు ఉన్నాయని ‘Way2News’ప్రచురించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఆసక్తికరంగా మారాయి.


