News December 11, 2024
గుంటూరు: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్(థియరీ) పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News December 26, 2024
గుంటూరు: రైల్లో నుంచి పడి మహిళ మృతి
రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.
News December 26, 2024
కొల్లూరు: పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన కారు డ్రైవర్
పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లింది. పృథ్వీరాజ్ అనే వ్యక్తి RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లైయి పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 26, 2024
కొల్లూరు: ట్రాక్టర్ కొనివ్వలేదని సూసైడ్
ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్లూరు మండలం సగ్గునలంకలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సగ్గునలంకకు చెందిన మణికంఠ ట్రాక్టర్ కొనివ్వాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వారు ఒప్పుకోకపోవడంతో 20వ తేదీన మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగాడు. కుటుంబసభ్యులు విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.