News April 10, 2024
గుంటూరు: భార్య గొంతు కోసి పరారైన భర్త

పెదకాకానిలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వెంగళరావు నగర్‌లో నివాసముంటున్న సయ్యద్ షామీర్ మూడేళ్ళ క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సయ్యద్ తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 11, 2025
గుంటూరు కలెక్టర్‌కు సీఎం ఇచ్చిన ర్యాంక్ ఎంతంటే.!

గుంటూరు కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆమె 816 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 770 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను సుమారు 35 గంటలు వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆమెకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 8వ ర్యాంక్ కేటాయించారు.

News December 10, 2025
GNT: సీఐపై నిందారోపణ కేసులో ట్విస్ట్

సీఐ తనపై దాడి చేయించారంటూ నిందలు మోపిన జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు సహా మరో ఇద్దరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీలను పెట్టుకుని తన కారును తానే ధ్వంసం చేయించి, పోలీసులపై అబద్ధపు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. విజయవాడ బస్టాండ్ వద్ద అరుణ్ బాబు, పొంగులూరి అన్వేష్, కారుకుట్ల సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.