News April 2, 2025
గుంటూరు: మద్యం సీసాతో దాడి.. ఒకరి మృతి

గుంటూరు శివారు రెడ్డిపాలెంలో ఒకరు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్ నాయక్ (60) కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తాడు. రాజుతో కలిసి ఇద్దరు మద్యం తాగారు. ఇద్దరి మద్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజు మద్యం బాటిల్‌తో రామ్‌నాయక్‌పై దాడి చేశాడు. దీంతో రామ్ నాయక్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News July 5, 2025
ములుగు: ‘లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

జిల్లాలో వర్షాకాలంలో ప్రమాదాల నివారణకు తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ 1800 4257109 నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రజలందరూ జిల్లా అధికార వాట్సాప్, ఛానల్‌ను చేసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News July 5, 2025
అమలాపురం: 10వ తేదీన మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 నిర్వహించాలని ఆదేశించినట్లు కలెక్టర్ మహేశ్ష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు.
News July 5, 2025
వనపర్తి: ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర కీలకం: కలెక్టర్

ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాత్ర ఎంతో కీలకమని, బీఎల్ఓలందరూ ఫామ్ 6, 7, 8లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు జులై 3వ తేదీ నుంచి జులై 10వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బీఎల్ఓలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.