News June 10, 2024
గుంటూరు: మాజీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు టీడీపీ నేత గౌరినాథ్‌ను దారుణంగా హత్యచేయించారని అన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని ప్రజలు ఛీ కొట్టినా బాబాయ్‌ని చంపినట్టే జననాన్ని జగన్ చంపుతున్నాడని మండిపడ్డారు. జగన్ హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News November 5, 2025
GNT: ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా సీసీఐకి విక్రయించాలి

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్‌లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
News November 5, 2025
సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.
News November 5, 2025
మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


