News April 11, 2024
గుంటూరు మిర్చియార్డుకు నేడు సెలవు

రంజాన్ పండుగ సందర్భంగా గురువారం మిర్చియార్డుకు సెలవు ప్రకటించారు. ఎటువంటి క్రయవిక్రయాలు జరగవని, రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని యార్డుకు మిర్చి తీసుకురావద్దని ఇన్‌ఛార్జ్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా మిర్చి విక్రయాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతులు బుధవారం 1,04,430 బస్తాలు యార్డుకు తరలించగా, అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 85,482 బస్తాలు నిల్వ ఉన్నాయి.
Similar News
News April 11, 2025
GNT: వేసవిలో తిరుపతి-శిర్డీ యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల్లో తిరుపతి, శిర్డీ యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మే 13 నుంచి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి శిర్డీకి నంబర్ 07037 రైలు నడుస్తుంది. చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి మీదుగా శిర్డీకి చేరుతుంది. తిరుగు ప్రయాణంగా నంబర్ 07638 రైలు మే 14 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం శిర్డీ నుంచి బయలుదేరి మంగళవారం తిరుపతికి చేరనుంది.
News April 11, 2025
GNT: చేబ్రోలు కిరణ్‌పై ఫిర్యాదుల వెల్లువ

గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా వేడి రేపుతోంది. కిరణ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినప్పటికీ, ఈ ఘటనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్‌లను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News April 11, 2025
హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్

ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను చర్చించినట్లు తెలిసింది.