News March 23, 2024
గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు

గుంటూరు మిర్చియార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతో పాటు సోమవారం హోలీ సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో యార్డులో 3 రోజులు పాటు క్రయవిక్రయాలు జరగవు. కర్ణాటకలో బాడిగ మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభం కావడంతో.. ఆ ప్రాంత రైతులు అక్కడికే సరకు తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం ఒక్కసారిగా మిర్చియార్డుకు సరకు తగ్గింది.
Similar News
News December 11, 2025
గుంటూరు కలెక్టర్‌కు సీఎం ఇచ్చిన ర్యాంక్ ఎంతంటే.!

గుంటూరు కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆమె 816 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 770 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను సుమారు 35 గంటలు వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆమెకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 8వ ర్యాంక్ కేటాయించారు.
News December 10, 2025
GNT: సీఐపై నిందారోపణ కేసులో ట్విస్ట్

సీఐ తనపై దాడి చేయించారంటూ నిందలు మోపిన జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు సహా మరో ఇద్దరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీలను పెట్టుకుని తన కారును తానే ధ్వంసం చేయించి, పోలీసులపై అబద్ధపు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. విజయవాడ బస్టాండ్ వద్ద అరుణ్ బాబు, పొంగులూరి అన్వేష్, కారుకుట్ల సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 10, 2025
గుంటూరు జిల్లాలో 4.78 లక్షల సంతకాలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ముగిసింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి మొత్తం 4,78,000 సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.


