News March 29, 2024

గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు

image

గుంటూరు మిర్చియార్డుకు మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. మూడు రోజులు పాటు మిర్చి క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో సాధారణంగా లావాదేవీలు జరగవు. ఈ వారంలో మూడు రోజులు మాత్రమే క్రయవిక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలని యార్డు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News October 25, 2025

అవాస్తవ, ద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవ ప్రచారాలు, ద్వేషపూరిత పోస్టులు, వీడియోలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం జూమ్ ద్వారా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, విదేశాల్లో ఉన్న నిందితులపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద పోస్టులు గమనిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.

News October 24, 2025

పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

image

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.

News October 24, 2025

ANU: ‘ఇన్‌ఛార్జ్ వీసీ సాధారణ విధులను మాత్రమే నిర్వర్తిస్తారు’

image

ANU ఇన్‌ఛార్జ్ VC సాధారణ విధులను మాత్రమే నిర్వర్తిస్తారని, జీతాల పంపిణీ మినహా కాంట్రాక్టర్లకు చెల్లింపులు, కొత్త నియామకాలు, సిబ్బందిని క్రమబద్ధీకరించడం వంటి విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ANU ఇన్‌ఛార్జ్ VCకి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీలో ఖర్చులకు ‘మించి’ బిల్లులు ఉన్నాయని ‘Way2News’ప్రచురించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఆసక్తికరంగా మారాయి.