News October 16, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలు..

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం లక్ష క్వింటాళ్ల AC సరుకు అమ్మకానికి వచ్చింది. రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు ధరలు ఇలా ఉన్నాయి. తేజా, 355, 2043 రకాలు: కేజీ ₹100 నుంచి ₹160 వరకు పలికాయి. యల్లో రకం: అత్యధికంగా కేజీ ₹200 నుంచి ₹230 వరకు పలికింది. నెంబర్ 5, DD రకాలు: కేజీ ₹110 – ₹155 మధ్య ఉన్నాయి. మీడియం సీడ్ రకాలు ₹80 – ₹100, బుల్లెట్ రకాలు ₹90 – ₹145 మధ్య ట్రేడ్ అయ్యాయి.
Similar News
News October 16, 2025
గుంటూరు జిల్లాలో 173 న్యూసెన్స్ కేసులు: ఎస్పీ

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నైట్ టైమ్‌లో అనవసరంగా తిరుగుతున్న 181 మందిపై 173 న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఓపెన్ డ్రింకింగ్, రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
News October 16, 2025
పెట్టుబడి వ్యయం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం కలక్టరేట్‌లో అధికారులతో సమీక్ష చేశారు. సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాయితీల వివరాలను రైతులకు వివరించాలని చెప్పారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధించేలా కృషి చేయాలన్నారు.
News October 16, 2025
అమరావతి: 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం

అమరావతి భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40.25 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కమిషనర్ కె. కన్నబాబు చర్చలు ఫలించాయి. ఉండవల్లిలో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు, ఇతర రోడ్ల నిర్మాణ పనుల కోసం 22 మంది రైతులు 12 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.