News December 26, 2025
గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ ఎవరంటే..?

ఎట్టకేలకు గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. టీడీపీకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు చాలామంది ఆశావహులు పోటీపడ్డారు. అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News December 27, 2025
TGTET హాల్ టికెట్లు విడుదల

TGTET హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. TETకు అప్లై చేసుకున్నవారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సా.4.30గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/
News December 27, 2025
గుత్తి వద్ద ఘోరం.. టిప్పర్ దూసుకెళ్లి 30 గొర్రెలు మృతి

గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి గుత్తి వైపునకు వెళ్తున్న ఇసుక టిప్పర్, రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కాపరులు కన్నీరుమున్నీరయ్యారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News December 27, 2025
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీసు

నల్గొండ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించింది. నల్గొండ నుంచి ప్రతి రోజు ఉదయం 6.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని ఆర్టీసీ డీపో మేనేజర్ ఎంవీ రమణ శనివారం తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సు స్థానంలో డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


