News October 23, 2024

గుంటూరు మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు 

image

తుఫాను కారణంగా గుంటూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23న సికింద్రాబాద్-భువనేశ్వర్(17016), సిల్చార్-సికింద్రాబాద్(12514), సికింద్రాబాద్-హౌరా(12704), యశ్వంత్ పూర్-హౌరా(12864) రద్దు చేశారు. అలాగే 24న హౌరా-సికింద్రాబాద్(12703), శాలిమార్-వాస్కో(18047), సికింద్రాబాద్-మాల్దా(03429), 25న భువనేశ్వర్-సికింద్రాబాద్(17015), భువనేశ్వర్-బెంగుళూరు(18463)రద్దు చేశారు. 

Similar News

News November 22, 2024

శాంతిభద్రతల ఏఎస్పీ రవికుమార్ బాధ్యతల స్వీకరణ

image

గుంటూరు జిల్లా శాంతి భద్రతల విభాగ ఏఎస్పీగా రవికుమార్ శుక్రవారం బాధ్యత స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ప.గో జిల్లా ఏఎస్పీగా ఉన్న రవికుమార్ గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మెక్కను అందించారు. జిల్లాలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. 

News November 22, 2024

గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి

image

గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాస్ ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయి శ్రీనివాస్ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News November 22, 2024

మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు

image

మంత్రి నారా లోకేశ్‌ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై మంగళగిరి పట్టణ పోలీసు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గత నెల 21వ తేదీన ఐ.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరీముల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.