News November 26, 2025
గుంటూరు యార్డులో ‘ఘాటైన’ ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు బుధవారం 90 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ‘యల్లో రకం’ మిర్చి ధర ఘాటెక్కింది. కిలో రూ.200 నుంచి రూ.250 వరకు పలికి రికార్డు సృష్టించింది. ముఖ్యమైన ధరలు (కిలోకు) 2043 ఏసీ: గరిష్ఠంగా రూ.200. నంబర్-5, 341 రకాలు రూ.180 వరకు, బంగారం, బుల్లెట్ రూ.175. తేజా ఏసీ రూ.120-152, ఇక సీడు తాలు రూ.60-90 వరకు ధర పలికాయి.
Similar News
News November 26, 2025
కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

కదిరి టౌన్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
News November 26, 2025
ఉమ్మడి ఖమ్మం నుంచే సీఎం పంచాయతీ ఎన్నికల శంఖారావం..!

సీఎం రేవంత్ రెడ్డి స్థానికసంస్థల ఎన్నికల శంఖారావాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పూరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబరు 2న కొత్తగూడెం పరిధి లక్ష్మిదేవిపల్లిలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భద్రాద్రి రామయ్య దీవెనలతో పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని సీఎం భావిస్తున్నారట. సీఎం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 26, 2025
హనుమాన్ చాలీసా భావం – 21

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే ||
శ్రీరాముని సన్నిధికి ఆంజనేయస్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా శ్రీరాముని చెంతకు ఎవరూ చేరలేరు. ఆ శ్రీరాముడు మనల్ని చల్లగా చూడాలంటే హనుమంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరి. రామయ్యకు అత్యంత ప్రీతిపాత్రుడైన, శక్తిమంతుడైన భక్తుడు హనుమంతుని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. త్వరగా మోక్షం లభిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


