News February 22, 2026
గుంటూరు: రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చినట్టేనా..?

TDP కంచుకోటగా ఉన్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని బద్దలు కొట్టడానికి YCPకి కొత్త అస్త్రం దొరికిందని YCP నాయకుల్లో చర్చ జోరుగా సాగుతుంది. తాజాగా అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్‌తో వారసురాలు రాజకీయాల్లోకి వస్తారని డౌట్ క్లియర్ అయిందన్న చర్చ నడుస్తుంది. అంబటి ఇంటిపై దాడి తర్వాత కుమార్తె మౌనిక ప్రత్యర్థులపై సంధించిన విమర్శ అస్త్రాలతో రాజకీయాల్లోకి వస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.
Similar News
News February 22, 2026
VZM: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం (D) సంతకవిటి (M) పోతురాజుపేటకి చెందిన ఐ.దివ్య (22)కి మార్చి 7న వివాహం నిశ్చయించారు. అయితే యువతి ఈనెల 20న గడ్డిమందు తాగింది. వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. పెళ్లి ఇష్టం లేకనే దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
News February 22, 2026
జగిత్యాల: యథాతథంగా ‘ప్రజావాణి’ కార్యక్రమం

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం యథాతథంగా ప్రజావాణి నిర్వహిస్తామని వెల్లడించారు. సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను నేరుగా స్వీకరిస్తామని చెప్పారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News February 22, 2026
పాకిస్థాన్ ఖాతాలో అవాంఛిత రికార్డు

T20WC సూపర్-8లో భాగంగా నిన్న న్యూజిలాండ్vsపాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక T20I మ్యాచ్‌లు(7) రద్దయిన జట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐర్లాండ్(6), న్యూజిలాండ్(6), ఇండియా(4), నెదర్లాండ్స్(4) ఉన్నాయి. నిన్న మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.


