News March 31, 2024

గుంటూరు: ‘లైసెన్స్ గన్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి’

image

ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే యజమానులు తమ లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. శనివారం జిల్లా ఎస్పీ తుషార్ దూడీతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి లైసెన్స్ గన్స్ అప్పగించడంపై సమావేశం నిర్వహించారు. సరెండర్ చేసిన తుపాకులు ఎన్నికలు ముగిసిన తరువాత సంబంధిత లెటర్‌ చూపించి తీసుకు వెళ్లవచ్చన్నారు.

Similar News

News March 21, 2025

కన్యాకుమారి- గుంటూరుకి ప్రత్యేక రైలు.!

image

చీపురుపల్లి నుంచి గుంటూరు మీదుగా కన్యాకుమారికి ప్రత్యేక రైలు నడవనట్లు దక్షిణామద్య రైల్వే గురువారం సాయంత్రం తెలిపారు. ట్రైన్ నంబర్ 07230 చీపురుపల్లి టు కన్యాకుమారి, 07229 కన్యాకుమారి నుంచి చీపురుపల్లి ఏప్రిల్ రెండో తారీకు నుంచి జూన్ 27వ తారీకు వరకు ఈ రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ సౌకర్యని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.

News March 21, 2025

గుంటూరులో ఉత్సాహంగా మహిళల ఆటల పోటీలు

image

పని ఒత్తిడి నుంచి విముక్తికి క్రీడలు దోహదపడతాయని CPDCL ప్రాజెక్ట్స్ డైరెక్టర్ KL.మూర్తి అన్నారు. ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ (విజయవాడ) సర్కిల్ ఉమెన్స్ గేమ్స్, కల్చరల్ కాంపిటీషన్స్‌ని గురువారం గుంటూరులో పరిశీలించారు. చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. గుంటూరు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ కేవీఎల్ఎన్ మూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

News March 20, 2025

గుంటూరు: పోలీస్ స్టేషన్‌కు చేరిన ప్రేమ వ్యవహారం

image

పొన్నెకళ్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(24) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేసి అరండల్ పేటలోని లాడ్జిలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తనను కొట్టి యువతిని తీసుకెళ్లారని నాగమల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరండల్ పేట సీఐ వీరస్వామి తెలిపారు.

error: Content is protected !!