News September 4, 2025
గుంటూరు వాసికి అరుదైన గౌరవం

గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ కాళహస్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. బల్ద్‌విన్ గ్రూప్ చీఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక నేషనల్ ఆర్బీ అవార్డు వరించింది. అమెరికాలో ఎంతో ప్రతిభ కనబర్చిన సీఈవోలు, టెక్ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్ (రాజ్) 2025 ఏడాదికిగానూ లార్జ్ కార్పొరేట్ విభాగంలో ఆర్బీ అవార్డును అందుకున్నారు.
Similar News
News September 6, 2025
ANU: B.Ed అడ్మిషన్ నోటిఫికేషన్ రేపు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీఈడ్‌సెట్-2025 బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
News September 6, 2025
గుంటూరు జిల్లాలో అరకు ఔట్ లెట్లు

గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది చోట్ల అరకు కాఫీ ఔట్ లెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరు గ్రామంలో, హైకోర్టు, అసెంబ్లీ ప్రాంగణాలతో పాటు గుంటూరు నగరంలో రెండు చోట్ల, తెనాలి, పొన్నూరు, మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వెలుగు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా అవుట్లెట్లు ఏర్పాటు కానున్నాయని అధికారులు అంటున్నారు.
News September 6, 2025
చర్మ విజ్ఙాన శాస్త్రంలో నిశ్శబ్ధ విప్లవం సృష్టించిన నాయుడమ్మ

పరిశోధనలు, మేధస్సుతో తోలు ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. ఈ నెల 10న ఆయన జయంతి. తెనాలి సమీపంలోని యలవర్రు ఆయన స్వగ్రామం. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ కావాలని ఆయన తపించారు. అందుకే ఆయనను ‘ప్రజల శాస్త్రవేత్త’గా కీర్తించారు. ఆయన సేవలకు 1971లో కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.