News December 29, 2024

గుంటూరు: విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్

image

10th విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఇమ్మానియేల్ పేటకు చెందిన అజయ్ కుమార్ చదువు మానేసి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడి చేశాడు. కడుపు నొప్పి రావడంతో బాలికను ఆసుపత్రికి తరలించే లోపు ఇంట్లోనే ప్రసవించిందన్నారు.

Similar News

News December 30, 2024

అమరావతి: పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్‌రాజు

image

అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. సినిమా టికెట్‌ రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాట్లపై చర్చించారు. కాగా కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. పవన్‌ హాజరవుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

News December 30, 2024

2024: ఉమ్మడి గుంటూరు పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

image

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో 15 YCP, 2 సీట్లలో TDP గెలిచింది. కాగా ఈసారి 3 ఎంపీ సీట్లతో పాటు 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన నెగ్గి క్లీన్ స్వీప్ చేశాయి. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి 90 వేల మెజార్టీతో నెగ్గడం విశేషం. మంత్రులుగా నారా లోకేశ్, నాదెండ్ల, అనగాని కొనసాగుతున్నారు.

News December 30, 2024

శావల్యాపురం: సైబర్ నేరగాళ్ల వలలో మండల నివాసి

image

శావల్యాపురం(M) కారుమంచికి చెందిన నరసింహారావు ఖాతాలోని నగదు మాయంపై ఫిర్యాదు అందినట్లు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. నరసింహరావు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిర్వహించుకొని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సైబర్ నేరగాడు నరసింహరావుకు ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ డబ్బులు ఖాతాలో పడతాయని, మీకు వచ్చిన లింక్ ఓపెన్ చేయమన్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలో డబ్బులు మాయయ్యాయి.