News March 25, 2024

గుంటూరు: విద్యాహక్కు చట్టం ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

విద్యాహక్కుచట్టం-2009 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశం పొందటానికి ఆన్లైన్ దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 31 వరకు పొడిగించినట్లు డీఈవో శైలజ ఆదివారం తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 27, 2024

హెల్మెట్ ధరించటం భారం కాదు బాధ్యత: ఎస్పీ

image

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో వాహనదారులకు నిర్వహించిన హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ తలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను గులాబీలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ నారాయణస్వామి, ఎస్ఐ మేరాజ్ తదితరులు పాల్గొన్నారు.

News December 27, 2024

కొండవీడు కోట చరిత్ర మీకు తెలుసా?

image

పల్నాడు జిల్లా యడ్లపాడు(M) కొండవీడు గ్రామ పరిధిలో ప్రఖ్యాతి చెందిన కొండవీడు కోట ఉంది. ఇది గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెడ్డిరాజులు 1325 నుంచి 1425 వరకు ఈ కోటను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటలో 21 నిర్మాణాలు ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకూ శిథిలావస్థలో ఉన్నాయి. కానీ నేటికీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందని ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులు తెలిపారు.

News December 27, 2024

తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి

image

రైల్వే కోడూరుకు చెందిన కానిస్టేబుల్ రాజయ్య గురువారం తాడేపల్లిలో మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లారు. డ్యూటీలో అస్వస్థతకు గురవ్వగా.. గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.