News April 9, 2025

గుంటూరు: వృద్దురాలి హత్యకేసులో నిందితులు అరెస్ట్ 

image

పాత గుంటూరు ఆనందపేటలో వృద్ధురాలిని హత్య చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. అర్షద్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. ఆమె సోదరులను తన బావమర్దులని చెప్తున్నాడు. దీంతో బాలిక సోదరులు, అర్షద్ కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో బాలిక సోదరులు ఫైరోజ్, ఫయాజ్‌లు అర్షద్ అమ్మమ్మ ఖాజాబి(70)ని కొట్టడంతో ఆమె చనిపోయింది.

Similar News

News October 27, 2025

GNT: తుపాను సహాయక చర్యలకు రూ. 50 లక్షలు విడుదల

image

తుపాను సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 50 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులను బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం సరఫరా చేయడం. వైద్య శిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్యం, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అవసరమైతే బాధితులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సూచించింది.

News October 27, 2025

గుంటూరు జిల్లాలో నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,99,558 కార్డులు ఉండగా వాటికి తోడు మరో 9 వేలు కొత్త కార్డులు తాజాగా ఆమోదించారు. తొలివిడతగా జిల్లాకు 5,85,615 స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఇప్పటివరకు 5,23,418 కార్డులను మాత్రమే పంపిణీ చేయగా, మరో 80 వేల కార్డులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. స్మార్ట్ రేషన్ కార్డులు డీలర్లు, సచివాలయ సిబ్బంది దగ్గర పేరుకుపోయాయి.

News October 27, 2025

సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి: DEO

image

తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. ఎంఈవోలు మండల కేంద్రాల్లో ఉండి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తుపాను షెల్టర్ల ఏర్పాటు కోసం తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సహకరించాలని తెలిపారు. డీఈవో కార్యాలయంలోనూ 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రేణుక చెప్పారు.