News June 22, 2024
గుంటూరు: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని ఓ మహిళ గొలుసు లాక్కుని పరారైన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. చౌత్రా సెంటర్‌కు చెందిన శేషారత్నం అనే వృద్ధురాలు శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఓ మహిళ అకస్మాత్తుగా శేషా రత్నం వద్దకు వెళ్లి ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారైంది. బాధితురాలు లాలాపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 22, 2026
కాసేపట్లో గుంటూరు రానున్న సీఎం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు ఏర్పాట్లతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ అజీజ్, తదితరులు ఉన్నారు.
News February 22, 2026
అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ నిర్ణయం

అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ CRDA నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని, R-5 జోన్‌లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని CRDA రద్దు చేసింది. R-5 జోన్‌తో అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బంది కలుగుతుందని CRDA భావిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. R-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు సిద్దమవుతుంది.
News February 22, 2026
GNT: కాంగ్రెస్ తీరుపై అంబటి తీవ్ర విమర్శలు

YSR మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వేధించిందని అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ కక్షతోనే జగన్‌పై CBI, EDఅక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు YSRవారసత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీపడలేదన్నారు. విదేశీ గడ్డపై దేశ పరువు తీయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుతో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసన్నారు.


