News August 29, 2025

గుంటూరు వైద్య కళాశాలలో రికార్డు

image

గుంటూరు వైద్య కళాశాల గురువారం రికార్డు నెలకొల్పింది. ఒకేరోజు 121 మంది విద్యార్థులకు MBBS కోర్సులో ప్రవేశాలు ఇవ్వడంతో పాటు వారందరికీ నిన్న సాయంత్రం 4 గంటలకే అడ్మిషన్ కార్డులు అందజేశారు. తొలుత వచ్చిన 50 మందికి 12 గంటలకే అడ్మిషన్లు పూర్తి చేశారు. వినాయక చవితి సెలవు అయినప్పటికీ వచ్చిన ఏడుగురికి బుధవారమే అడ్మిషన్ ఇవ్వగా. ఇప్పటివరకు మొత్తం 195 మంది కళాశాలలో చేరారు. కాగా ఇంకా 16 మంది చేరాల్సి ఉంది.

Similar News

News August 29, 2025

రుద్రవరంలో పర్యటించిన వ్యవసాయ నిపుణులు

image

సంతనూతలపాడు మండలం రుద్రవరంలో శుక్రవారం రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుహాసిని ఆధ్వర్యంలో పలువురు ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు పర్యటించారు. ఈ సందర్భంగా రుద్రవరం గ్రామంలో రైతు మీనమ్మ సాగు చేసిన నిమ్మ తోటను వారు సందర్శించారు. పంటలను పరిశీలించి, స్థానికంగా వ్యవసాయంపై రైతులు చూపుతున్న ఆసక్తిని వారు అభినందించారు.

News August 29, 2025

గద్వాల: ‘రైతులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం’

image

గద్వాల జిల్లాలో యూరియా సరఫరా కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో రైతులకు యూరియా సరఫరా చేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద సిబ్బందిని కేటాయించడంతోపాటు అధికారులు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించారని చెప్పారు.

News August 29, 2025

తెలుగు మాట్లాడితే మనశ్శాంతి!

image

తెలుగు భాష గొప్పతనం గురించి ఇప్పటి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు పదాలు పలకడం వల్ల మన ఆరోగ్యమూ మెరుగవుతుంది. ఇది శరీరంలోని 72వేల నాడులను యాక్టివ్ చేసి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దేశంలో నాలుగో, ప్రపంచంలో 16వ అతిపెద్ద భాష కూడా తెలుగే. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల మధ్య ఉన్న భాగాన్ని ‘త్రిలింగ దేశం’ అనేవారు. ఈ ‘త్రిలింగ’ పదం నుంచే తెలుగు పదం వచ్చింది. share it