News November 20, 2024
గుంటూరు: శబరిమల వెళ్లే వారికి స్పెషల్ ట్రైన్స్
శబరిమల వెళ్లే జిల్లా వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లం (07145), మచిలీపట్నం-కొల్లాం స్పెషల్ (07147), కొల్లాం-మచిలీపట్నం స్పెషల్ (07148) టైన్స్‌ను గుంటూరు మీదుగా వెళ్తాయని డీఆర్ఎం ఎం. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలోని తెనాలి, బాపట్ల, చీరాలలో ఆగుతాయని తెలిపారు.
Similar News
News January 28, 2025
గుంటూరులో మరో ఫ్లైఓవర్ నిర్మాణం: ఎంపీ పెమ్మసాని
గుంటూరు ప్రజలకు కేంద్ర మంత్రి పెమ్మసాని గుడ్ న్యూస్ చెప్పారు. గుంటూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు మూడో ఫ్లై ఓవర్ నిర్మాణంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ.. గుంటూరు-నల్లపాడు మధ్యలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంకు ఆమోదం తెలిపిందన్నారు.
News January 28, 2025
సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్య సంఘాల కృతజ్ఞతలు
ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ విదియ తిథి నాడు రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 181 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్యవైశ్య సంఘాలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ ఆధ్వర్యంలో సచివాలయంలో సీఎంను కలిసిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
News January 27, 2025
GNT: పెద్దకర్మకు వెళ్లి అఘాయిత్యం
మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన దారుణ ఘటన వేమూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఆంజనేయులు వేమూరు మండలం జంపని గ్రామంలో ఈనెల 23వ తేదీన బంధువుల పెద్ద కర్మకు వచ్చాడు. అక్కడ అదే రోజు అర్ధరాత్రి కూతురు వరుసయ్యే మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆంజనేయులను అదుపులోకి తీసుకొని తెనాలి కోర్టులో హాజరు పరిచామన్నారు.