News May 21, 2024
గుంటూరు: సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లు.. చర్చనీయాంశం

పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయకుండా వదిలేసిన వైనం చర్చనీయాంశమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను జీఎంసీలోని అద్దాల గదిలో ఉంచారు. సరైన భద్రత లేని ఆ గది నుంచి బాక్సులను మార్చాలని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల అధికారులు వాటిని మరో స్ట్రాంగ్ రూంలోకి మార్చారు. వాటికి సీల్ లేకపోవడం గుర్తించి అధికారులకు తెలపడంతో సీల్ వేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.
Similar News
News February 28, 2026
GNT: ఒకప్పటి ద(ర్జీ)ర్జానే వేరయా..!

కార్యం ఏదైనా కుట్టిన దుస్తులు అంటే గుర్తొచ్చేది దర్జీ. కాల క్రమేణా ప్రజలు రెడీమేడ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దర్జీ కూలీ, రెడీమేడ్ దుస్తులు అటు, ఇటుగా ఒకటే అవుతుండటంతో అప్పటికప్పుడు దొరికే రెడీమేడ్ దుస్తులు కొంటున్నారు. ఒకప్పుడు దర్జీకి కొలతలు ఇవ్వడం, స్టిచ్చింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? అని ఎదురు చూడటం అంతా ఆసక్తిగా ఉండేది. నేడు టైలర్స్ డే ఈ సందర్భంగా వారితో మీకు ఉన్న అనుబంధం కామెంట్ చేయండి.
News February 28, 2026
మంగళగిరి: జనసేన ఆఫీస్ ఘటన.. ఐదుగురు పోలీసులు సస్పెండ్?

మంగళగిరి జనసేన కార్యాలయంలో నీలాద్రి అనే వ్యక్తి కార్ల అద్దాలను ధ్వంసం చేసి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు ఆరంభించారు. భద్రతా విభాగం రిజర్వు ఇన్స్పెక్టర్ పెంటారావుతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. భద్రత వైఫల్యాల వల్లనే ఘటన చోటు చేసుకుందని నిర్ధారణ కావడంతో చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నీలాద్రిని అరెస్ట్ చేశారు
News February 28, 2026
అమరావతిలో సీజేఐ పర్యటనకు పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

భారత ప్రధాన న్యాయమూర్తి అమరావతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో శంకుస్థాపన వేదికలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని అధికారులకు ఆమె స్పష్టం చేశారు.


