News February 28, 2025
గుంటూరు: స్ట్రాంగ్ రూమ్‌ని పరిశీలించిన కలెక్టర్

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల బ్యాలెట్ బాక్సులను గుంటూరు ఏసీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. పోలింగ్ పక్రియ ముగిసిన తర్వాత అన్నీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలకు తీసుకొచ్చారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ స్ట్రాంగ్ రూమ్ రూమ్‌లో బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 28, 2025
మంగళగిరి: చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, బడ్జెట్లో రూ.2000 కోట్ల కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరి చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం కమిషనర్ రేఖారాణి కి వినతిపత్రం ఇచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, అధ్యక్షులు కె శివ దుర్గారావు మాట్లాడుతూ చేనేత సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
News February 28, 2025
గుంటూరు: సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే 2 రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 1,2 తేదీలలో గుంటూరు-విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 2,3 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
News February 27, 2025
గుంటూరులో యాక్సిడెంట్ ఇద్దరు దుర్మరణం.!

కాకానిరోడ్డులోని వాసవీ మార్కెట్ వద్ద మూడు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సి.హెచ్ వెంకటేశ్ (15), లాలాపేట ప్రాంతానికి చెందిన అలీ (28) ఈ ప్రమాదంలో మరణించారు. మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.