News September 22, 2025
గుంటూరు: హాస్టల్‌లో యువతి అనుమానాస్పద మృతి

గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికంగా ఒక హాస్టల్‌లో ఉంటున్న ఆమె, తన ముఖానికి ప్లాస్టర్ వేసి నిర్జీవంగా పడి ఉండటంతో సహచర విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 22, 2025
ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News September 22, 2025
కొమురవెల్లి: ప్రేమ విఫలం యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమురవెల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గౌరాయిపల్లికి చెందిన పెద్ది మధుసూదన్ రెడ్డి(23) గత కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. యువతి ఇంట్లో ప్రేమ విషయం తెలవడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
News September 22, 2025
KNR: రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన లారీ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి KNRవైపు వెళ్తున్న ఓ లారీ తాడికల్ గ్రామ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళ గాయపడగా మరో మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. లారీ పాక్షికంగా దెబ్బతింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.