News April 11, 2025

గుంటూరు: హైదరాబాద్‌కు 4లైన్ నేషనల్ హైవే

image

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నేషనల్ హైవేల పనులు వేగవంతమయ్యాయి. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా మీదుగా బాపట్ల జిల్లాకు వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు 167ఏ జాతీయ రహదారి రూ.1,064.24 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఆఖరికి హైవే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలను కలుపుతూ 4లైన్‌ల హైవేను హైదరాబాద్‌కు నిర్మించే పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్టు సమాచారం. 

Similar News

News April 18, 2025

గుంటూరు: పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు

image

గుంటూరులో ఓ యూట్యూబర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన యువతికి మార్చి 10న నల్లచెరువు 2వ లైనుకు చెందిన కైలాశ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18న పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, చేసుకోను అంటూ వెనక్కి తగ్గాడు. మధ్యలో పెద్దలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బాధిత యువతి లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 18, 2025

గుంటూరు: స్పోర్ట్స్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఎంఎస్‌సీ స్పోర్ట్స్ కోచింగ్, పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు డిఎస్ఈవో పి.నరసింహారెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రవేశాల ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు మే 2వ తేదీలోపు ‘ssc.nsnis.in’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 18, 2025

తెనాలి: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

image

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.

error: Content is protected !!