News March 22, 2025

గుంటూరు హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

image

గుంటూరు జాతీయ రహదారిపై, అద్దంకి వెళ్లే మార్గంలో మేదరమెట్ల వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో మరణించిన వ్యక్తి వివరాలు, వాహనం ఆనవాళ్లు లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 19, 2025

బైరెడ్డి హౌస్ అరెస్ట్

image

నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డా.దారా సుధీర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు వెళ్తున్న ఆయనను నందికొట్కూరు డిగ్రీ కాలేజ్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.

News September 19, 2025

శాసనమండలి వాయిదా

image

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.

News September 19, 2025

కామారెడ్డి జిల్లా వర్షపాతం వివరాలు

image

కామారెడ్డి జిల్లా వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. బీబీపేట, సర్వాపూర్‌‌లో 9.3 మి.మీ, ఎల్పుగొండలో 9, భిక్కనూర్‌ 5.3, దోమకొండ 4.5, రామలక్ష్మణపల్లి 4.3, మేనూర్‌ 2.8, పెద్ద కొడప్గల్‌ 1.8, ఐడీవోసీ (కామారెడ్డి), పాత రాజంపేట 1.5, సదాశివనగర్‌ 1, జుక్కల్‌‌లో 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల వర్షం ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.