News April 20, 2025
గుంటూరు: 19 పరుగులు చేసిన రషీద్

వాంఖండే వేదికగా జరుగతున్న చైన్నై -ముంబాయి మ్యాచ్‌లో గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ ఆదివారం పర్వాలేదనింపించారు. ఓపెనర్‌గా వచ్చి 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. శాంట్నర్ వేసిన బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యి వెనుదిరిగారు. కాగా.. దీనికంటే ముందు మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన రషీద్ 27 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 21, 2025
IPL: ముంబై సునాయాస విజయం

చెన్నై చాలా కష్టంగా చేసిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్‌మని ఊదేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(76*)తో ఫామ్‌లోకి రాగా అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధ శతకం(68*) చేయడంతో 16వ ఓవర్లోనే MI టార్గెట్‌ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
News April 21, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.
News April 21, 2025
అరసవల్లిలో పోటేత్తిన భక్తులు..పెద్ద మొత్తంలో ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నేడు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.2,66,700- లు, పూజలు విరాళాల రూపంలో రూ.70,548, ప్రసాదాల రూపంలో రూ.1,38,320 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.