News April 15, 2025
గుంటూరు: 22 కేసుల్లో ముద్దాయి అరెస్ట్

2019 నుంచి గుంటూరు, నంద్యాల జిల్లాల్లో దారిదోపిడులు, దొంగతనాలు చేస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సుగాలిమెట్ట సమీపంలోని జంబులమ్మ గుడివద్ద పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హనుమంతుతో పాటు అతడి ముఠా సభ్యులపై 22 కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ వెల్లడించారు.
Similar News

గర్భిణీలు ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యండి: DMHO

గుంటూరు DMHO కాన్ఫరెన్స్ హాలులో Dr. K. విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ఆశా నోడల్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. DMHO మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రామ్‌ను గర్భిణీ, బాలింతల కోసం ప్రవేశ పెట్టిందన్నారు. గర్భిణీకి 4నెల నుంచి బిడ్డకు ఒక సంవత్సవరం వచ్చే వరకు కిల్కారి ఫోన్ కాల్స్ (01244451660/14423) లిఫ్ట్ చేస్తే పూర్తి సమాచారాన్ని వినగలుగుతారన్నారు. ఈ సేవలను బాలింతలు ఉపయోగించుకోవాలని కోరారు.
News April 15, 2025
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ వాయిదా

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదని కోర్టుకు తెలిపారు. దీంతో జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.