News February 13, 2025

గుంటూరు: 30 మంది నామినేషన్‌ల ఆమోదం

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. గుంటూరు కలెక్టరేట్‌లో బుధవారం అభ్యర్థుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులు కరుణ, కలెక్టర్‌ నాగలక్ష్మి నామినేషన్ల పరిశీలన చేపట్టారు. మొత్తం 40 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 10 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. 30 మంది నామినేషన్లను ఆమోదించారు. 

Similar News

News February 13, 2025

SnapChatలో రికార్డు సృష్టించారు!

image

మీరెప్పుడైనా స్నాప్‌చాట్ వాడారా? అందులో ఇద్దరు స్నేహితులు కలిసి స్నాప్ పంపించుకుంటే స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది. రోజూ ఒక స్నాప్ (ఫొటో/వీడియో) పంపిస్తుంటే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఇలా కాటీ &ఎరిన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ 3662+ స్ట్రీక్‌తో రికార్డు సృష్టించారు. అంటే వీరి స్నాప్ జర్నీ పదేళ్లు దాటిందన్న మాట. వీరి తర్వాత లెస్లీ & జయ్నబ్ (3536+), ఎర్మిరా & జవి (3528+) ఉన్నారు. మీ హైయెస్ట్ స్ట్రీక్స్ ఎంత?

News February 13, 2025

SRD: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

News February 13, 2025

సిద్దిపేట: వ్యక్తి పై నుంచి వెళ్లిన కంటైనర్

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వర్గల్ మండలం తునికి మక్తా గ్రామానికి చెందిన స్వామి(45)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

error: Content is protected !!