News March 1, 2025
గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పతకాలు

గుంటూరుకు చెందిన దివాకర్(80) ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన 80 సంవత్సరాల స్పోర్ట్స్ మీట్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హేమర్, జావలిన్, డిస్క్ త్రోలో వరుసగా మూడు బంగారు పథకాలను సాధించారు. గుంటూరు ఆఫీసర్స్ క్లబ్ మేనేజర్‌గా ఈయన పనిచేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అనంతపూర్‌లో జరిగిన పోటీలలో కూడా 3 బంగారపు పతకాలను కైవసం చేసుకున్నాడు. దీంతో ఈయనను పలువురు అధికారులు అభినందించారు.
Similar News
News December 30, 2025
GNT: సారస్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) మస్కట్‌ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు నల్లపాడు రోడ్డులో సారస్ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో “మిరప కాయ” నే మస్కట్‌గా ఎంపిక చేసి రూపొందించారని తెలిపారు.
News December 30, 2025
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 322 మంది మృతి చెందగా, 2024లో 429 మంది మరణించారు. దీంతో 25 శాతం మేర తగ్గుదల నమోదైంది. అలాగే ఈ సంవత్సరం 76 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 6% తగ్గాయి. ఈ కేసులలో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారంతో కూడినవిగా ఉన్నవి.
News December 30, 2025
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ

2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.


