News February 10, 2025

గుంటూరు: LLB పరీక్షల ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన LLB 2వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. LLB కోర్సు పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

Similar News

News February 10, 2025

గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్‌గా కరుణ

image

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకురాలిగా వి.కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ను ఆమె సందర్శించారు. కలెక్టర్ నాగలక్ష్మీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, నామినేషన్లతో పాటూ ఇతర వివరాలను ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ వివరించారు.  

News February 10, 2025

కాకుమానులో ప్రమాదాలు.. ఇద్దరి మృతి

image

కాకుమాను మండలంలో సోమవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి ఘటన స్థలంలో మృతి చెందాడు. మండలంలోని కొండపాటూరు గ్రామంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు క్రాంతి కుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 10, 2025

తాడేపల్లి: జగన్ ఇంటి వద్ద కెమెరాలు 

image

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ నుంచి మానిటర్ చేయనున్నారు.

error: Content is protected !!