News December 17, 2025
గుండాలలో 1,344 ఓట్ల తేడాతో విజయం

గుండాల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు దేవనబోయిన ఐలయ్య 1,344 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కోన్నారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
Similar News
News December 21, 2025
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో రేపు ప్రజావాణి రద్దు

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో 22న నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్
మనుచౌదరి పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరంలో శీతాకాల విడిది ముగించుకొని తిరిగి సోమవారం ఢిల్లీ వెళ్తుండటంతో ఏర్పాట్ల పనులలో జిల్లా యంత్రాంగం, అధికారులు నిమగ్నమై ఉండటంతో రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమాచారాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు.
News December 21, 2025
జగిత్యాల: ఎమ్మెల్యే నివాసంలో వైద్యాధికారుల సమావేశం

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎ.శ్రీనివాస్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డిప్యూటీ DMHO) డా.ఎన్.శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు, ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, కొనసాగుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు.
News December 21, 2025
U19 Asia Cup: మరోసారి ‘కప్’ గొడవ?

మెన్స్ <<17879920>>ఆసియా కప్ ట్రోఫీ<<>> విషయంలో ACC చీఫ్ నఖ్వీతో వివాదం గురించి తెలిసిందే. ఇప్పటికీ ట్రోఫీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి కప్ గొడవ జరిగేలా కనిపిస్తోంది. ఇండియా-పాక్ U19 Asia Cup <<18629192>>ఫైనల్<<>>కు నఖ్వీ హాజరవుతారని తెలుస్తోంది. మ్యాచ్ విన్నర్లకు ట్రోఫీని ఆయనే అందజేస్తారు. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఆయన నుంచి ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉంది. దీంతో నఖ్వీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.


