News February 25, 2025

గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

image

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్‌లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.

Similar News

News February 20, 2026

హన్మక్కపల్లిలో చిరుత బీభత్సం

image

వేములవాడ మున్సిపల్ పరిధి హన్మక్కపల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి రైతు రోమాల భూమయ్యకు చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. పాదముద్రలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఇది చిరుత పనేనని నిర్ధారించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘటనాస్థలికి చేరుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బాధిత రైతును పరామర్శించారు.

News February 20, 2026

ఎనిమిదేళ్లకే ఇంత టాలెంటా!

image

రణవీర్ సచ్‌దేవా(8) అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 4 ఏళ్లకే నాసా వెబ్‌సైట్‌లో చోటు సంపాదించిన ఈ బుడతడు.. 5 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన ‘యాపిల్ ప్రోగ్రామర్‌’గా గుర్తింపు పొందాడు. 6 ఏళ్లకే ‘టెడెక్స్’ స్పీకర్‌గా రికార్డు సృష్టించాడు. పర్యావరణంపై తనకున్న అవగాహనతో ‘గ్రీన్ యోధా’గా నిలిచాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ సమ్మిట్’లో కీనోట్ స్పీకర్‌గా ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాడు.

News February 20, 2026

రోడ్డు ప్రమాదంలో సారపాక విద్యార్థి దుర్మరణం

image

ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్‌రెడ్డి(20) గుంటూరు హైవేపై బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొనడంతో కిందపడిన అతనిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి అకాల మరణంతో గ్రామంలో విషాదం నిండింది.