News March 17, 2025
గుండెపోటుతో ఆదివాసీ నాయకుడు మృతి

ఆళ్లపల్లి మండలం, మర్కోడు పంచాయితీ జిన్నెలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు కొమరం నరసింహారావు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. నరసింహారావు వ్యవసాయం చేస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం క్రియాశీలపాత్ర పోషించాడు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పలువురు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
Similar News
News March 17, 2025
కోటబొమ్మాళి : టెన్త్ పరీక్షలకు భయపడి విద్యార్థి పరార్

కోటబొమ్మాలి మండలంలోని జగనన్న కాలనీలో నివాసముంటున్న విద్యార్థి 10వ తరగతి పరీక్షలకు భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పరీక్షలకు చదవమని ఇంట్లో మందలించారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కోటబొమ్మాళి పీఎస్‌లో పేరెంట్స్ ఫిర్యాదు చేశామన్నారు.
News March 17, 2025
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన JIO

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్- 2025 ప్రారంభం కానున్న వేళ క్రికెట్ అభిమానులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. ₹299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో ఎంపిక చేసిన వాటిని రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ మొబైల్/TV 4K సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని తెలిపింది. అయితే, ఈరోజు నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రీఛార్జ్ చేసుకునే సమయంలో ప్యాక్ వివరాలను చెక్ చేసుకోండి.
News March 17, 2025
వయసు పెరిగినా స్ట్రాంగ్‌గానే ఉంటా: విజయశాంతి

వయసు పెరిగినా తాను స్ట్రాంగ్‌గానే ఉంటానని నటి విజయశాంతి అన్నారు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. తన విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందన్నారు. తానే స్వయంగా ఫైట్ సీన్స్ చేసినట్లు పేర్కొన్నారు. అవి చూసి సెట్లో వారంతా షాక్ అయ్యారని తెలిపారు.