News February 18, 2025
గుండెపోటుతో దేవనకొండ హెచ్ఎం మృతి

దేవనకొండ మండల కేంద్రంలోని ఎంపీపీ స్కూల్లో (మెయిన్) విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం పద్మావతి సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దేవనకొండలో బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె భర్త రఘునాథ్ తెలిపారు. ఈ ఘటనతో దేవనకొండలో విషాదఛాయలు అమలుకున్నాయి. ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు.
Similar News
News February 20, 2025
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. 69 సెంటర్లలో 23,098 మంది ఫస్ట్ ఇయర్, 22,227 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
News February 20, 2025
‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి’

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అమరావతి ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులోని సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ఏర్పాటయ్యే పరిశ్రమలలో స్థానిక యువతకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జీవో తేవాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
News February 20, 2025
శ్రీశైలం వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్

శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ అధికారులు కీలక సూచన చేశారు. దోర్నాల, శిఖరం చెక్ పోస్ట్‌ల వద్ద ఈ నెల 24 నుంచి 28 వరకు వాహనాలకు 24 గంటల అనుమతి ఉందని రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. తెలంగాణ పరిధిలోని మన్ననూరు, దోమలపెంట వద్ద 23 నుంచి మార్చి 1 వరకు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే 24 గంటలు అనుమతిస్తామని రేంజర్స్ రవికుమార్, గురు ప్రసాద్ వెల్లడించారు.