News October 17, 2025

గుండ్లకమ్మ ప్రాజెక్టుపై అధికారులకు కలెక్టర్ సూచనలు

image

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతోనే బాపట్ల జిల్లాలోని 13,876 ఎకరాలకు సాగునీరు రావడంలేదని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం చెప్పారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరులో 50 ఎకరాల భూసేకరణ పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. తక్షణమే భూ సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 14 గేట్లు మరమ్మతులు పూర్తి కాగా, మరొకదానికి పనులు జరుగుతున్నాయన్నారు.

Similar News

News October 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 17, 2025

మామునూరు ఎయిర్‌పోర్టును నిధులు.. సీఎంను కలిసిన ఎంపీ

image

మమునూరు ఎయిర్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ కడియం కావ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్ల నిధులను కేటాయించారు. WGL ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభించబోతోందని ఎంపీ స్పష్టం చేశారు.

News October 17, 2025

‘ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధత కావాలి’

image

పార్వతీపురం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధత కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల సంసిద్ధతపై గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతుల నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా నిర్ణయించామన్నారు.