News April 10, 2025
గుంతకల్లు: రైల్వే అభివృద్ధి పనులపై సమీక్ష

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ఎస్ఆర్‌సి కమిటీ సభ్యులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జి, కసాపురం రోడ్డులోని రైల్వే బ్రిడ్జి ఎత్తు పెంచే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే తెలిపారు.
Similar News
News April 18, 2025
కియా ఇంజిన్ల చోరీ.. కీలక అప్‌డేట్

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక్కడ చోరీ చేసిన ఇంజిన్లను తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో విక్రయించినట్లు సమాచారం. కొనుగోలుదారులు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఇప్పటికే అరెస్టైన వారిని త్వరలో కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.
News April 18, 2025
SKU అధ్యాపకురాలికి గిన్నిస్ బుక్‌లో చోటు

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం అధ్యాపకురాలు పూజిత అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. సంగీత వాయిద్య ప్రదర్శనలో ఆమె ఆ ఘనత సాధించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబరిచిన పూజితకు హైదరాబాదులో ఈ అవార్డు అందచేశారు.
News April 18, 2025
కేంద్ర మంత్రికి ఎంపీ అంబికా ప్రశంస

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్-2025గా ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తిగా ఆయనకు వచ్చిన ఈ అంతర్జాతీయ గుర్తింపు.. మన రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణమన్నారు. శ్రమ, సమర్ధత, విజన్ కలిగిన యువ నాయకుడు రామ్మోహన్ అని ఎంపీ ప్రశంసించారు.