News February 27, 2025

గుంతకల్లు వాసికి సన్మానం

image

గుంతకల్లుకు చెందిన బ్లడ్ డోనర్ రెడ్ డ్రాప్ రెహ్మాన్‌కు అరుదైన గౌరవం లభించింది. కర్ణాటక తొర్నగల్ జిందాల్ ఫ్యాక్టరీలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రెహ్మాన్‌ను జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ మేనేజర్ పెద్దన్న, ముఖ్య అతిథులు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ సునీల్ రాల్ఫా చేతుల మీదుగా జ్ఞాపికతో సత్కరించారు. 133 సార్లు రక్తదానం చేసినందుకు రెహ్మాన్‌కు సన్మానం చేశారు.

Similar News

News December 16, 2025

PGRSకు అన్ని శాఖల అధికారులు పాల్గొనాలి: కలెక్టర్

image

మండల స్థాయిలో నిర్వహించే PGRS కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ప్రతి మండలం, డివిజన్ కార్యాలయాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి హాజరయ్యేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పీజిఆర్ఎస్ కార్యక్రమానికి అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.

News December 15, 2025

ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

image

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.

News December 15, 2025

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: SP

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే ప్రతి పిటిషన్‌ను విచారించి తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 96 అర్జీలు స్వీకరించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.