News May 1, 2024

గుంపు మేస్త్రీ గూబ పగలాలి: హరీశ్‌రావు

image

తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన గుంపు మేస్త్రీకి పార్లమెంట్ ఎన్నికల్లో గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు షో‌లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి‌తో కలిసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం చేసి మన చెరువులు కుంటల్లోకి నీళ్ళు తెచ్చిన కేసీఆర్‌కు పట్టం కట్టాలని ఆయన కోరారు.

Similar News

News April 5, 2026

దళిత బంధు పథకం జగ్జీవన్ రామ్ ఆలోచనల ప్రతిఫలం: కేసీఆర్

image

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలను స్మరించారు. సామాజిక న్యాయం, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి దేశ ప్రగతికి కృషి చేశారని పేర్కొన్నారు. దళిత సాధికారతకు దళిత బంధు వంటి పథకాలు ఆయన ఆలోచనల స్ఫూర్తితోనే అమలవుతున్నాయన్నారు.

News April 5, 2026

జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

image

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా బాబు జగ్జీవన్ రామ్ గుర్తుండిపోతారన్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు.

News April 5, 2026

మెదక్: 3 నెలల రేషన్.. 30 వరకు పంపిణీ

image

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.