News September 6, 2025

గుజరాత్‌లో ప్రమాదం.. పల్నాడు యువకుడి మృతి

image

ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన కొడవటి నరేశ్ (17) గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్నేహితులతో కలిసి ఎస్‌యూవీ వాహనంలో టూర్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. వాహనం అదుపు తప్పడంతో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మరణించగా, వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు.

Similar News

News September 6, 2025

కామారెడ్డి: GPOలు అంకిత భావంతో పనిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎంపికైన GPOలు అంకిత భావంతో పని చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సూచించారు. శనివారం GPOలు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు. గ్రామాల్లో రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నియమించిందని గుర్తు చేశారు.

News September 6, 2025

కిస్ క్యామ్‌‌లో దొరికిన HR.. భర్తతో విడాకులు!

image

కోల్డ్ ప్లే కన్సర్ట్‌లో ఆస్ట్రోనోమర్ CEO ఆండీ బైరోన్‌తో కిస్‌ <<17113447>>క్యామ్‌లో<<>> దొరికిన HR క్రిస్టిన్ తన భర్త ఆండ్రూ నుంచి విడిపోతున్నారు. AUG 13న ఆమె న్యూ హాంప్‌షైర్‌లోని పోర్ట్స్‌మౌత్ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. తాజాగా ఈ విషయం బయటికొచ్చింది. కిస్ క్యామ్ వీడియో వైరల్ కాగా సదరు కంపెనీ బైరోన్‌, క్రిస్టిన్‌ను తొలగించింది. ఇక అప్పటి నుంచే ఆండ్రూ-క్రిస్టినా వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.

News September 6, 2025

HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

image

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.