News April 11, 2025
గుడిపాడులో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసిన జేసీ

కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని మునగాల, మల్లాపురం, గుడిపాడు గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ నవ్య పర్యటించారు. శుక్రవారం గుడిపాడులో రూ.8 లక్షల కుడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేశారు. తాగునీటి సమస్యపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంతృప్తిని చూసి జేసీ సంతోషం వ్యక్తం చేశారు. కుడా నిధులతో అభివృద్ధి పనులు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో MRO, AO పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.
News April 18, 2025
నంద్యాల మెడికల్ విద్యార్థిని కాపాడిన ట్రైనీ IPS

నంద్యాలకు చెందిన యువకుడు తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది రామచంద్రాపురం మండల పరిధిలోని అడవిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులకు చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించగా.. రామచంద్రాపురంలో ట్రైనింగ్ తీసుకుంటున్న IPS బొడ్డు హేమంత్ స్పందించారు. 20 నిమిషాల్లో విద్యార్థి ఫోన్ ట్రేస్ చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని కాపాడి కౌన్సెలిగ్ ఇచ్చారు.
News April 18, 2025
ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా

తుంగభద్ర దిగువ కాలువకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజుల క్రితం వరకు నీటి సరఫరా కొనసాగగా తాజాగా పూర్తిగా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు తగ్గుముఖం పడటంతో ఉన్నతాధికారుల అదేశాల మేరకు నిలిపివేసిటన్లు సమాచారం. టీబీ డ్యాంలో ప్రస్తుతం 7.037 టీఎంసీల నీరు నిల్వ ఉండగా జలాశయానికి ఎలాంటి ఇన్ ఫ్లో లేదు.