News December 19, 2025
గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ బాగోతం.!

గుడివాడలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కూనసాని వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న వినోద్‌ను గుడివాడ వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వినోద్‌ను కోర్టుకు తరలించారు. మిగిలిన బెట్టింగ్ బ్యాచ్‌ను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.
Similar News
News December 24, 2025
మొదటి ప్లమ్ కేక్ స్టోరీ: మంబల్లి బాపు మ్యాజిక్!

మన దేశంలో మొదటి ప్లమ్ కేక్ 1883లో కేరళలోని తలస్సేరిలో తయారైంది. మంబల్లి బాపు అనే బేకరీ యజమాని దీన్ని తయారు చేశారు. అప్పటి బ్రిటిష్ ఆఫీసర్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన కేక్ తిని దాన్ని మన దేశీ స్టైల్‌లో రీక్రియేట్ చేశారు. విదేశీ బ్రాందీకి బదులు స్థానిక జీడిమామిడి పండ్ల సారా, అరటిపండ్లు వాడి అద్భుతమైన రుచిని తెచ్చారు. ఇప్పటికీ అదే పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఈ కేకులను తయారు చేస్తున్నారు.
News December 24, 2025
ADB: 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపికలు

ఈ నెల 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు అండర్-16,18, 20 బాల బాలికలకు, మెన్ అండ్ ఉమెన్స్‌కి వేరువేరుగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అధ్యక్షుడు బోజా రెడ్డి తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జనవరి 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్హులైన, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.
News December 24, 2025
జిల్లాకు తలమానికం ‘జలజీవన్ మిషన్’: కలెక్టర్

జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,650 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసిందని, ఇది జిల్లా అభివృద్ధికి తలమానికమని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.


