News April 5, 2024
గుడివాడలో నోటాను దాటని జాతీయ పార్టీలు

2019లో గుడివాడ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. నోటాకు 3,285 ఓట్లు(1.96%) పోల్ అవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాత్రేయులుకు 1,401(0.83%) ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీ రాజబాబు 1,212(0.72%) ఓట్లు సాధించారు. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ ఈ సారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది.
Similar News
News December 31, 2025
ఇన్నోవికాస్-2025లో భాగస్వామ్య ఒప్పందం

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో వికాస్ ఇంజినీరింగ్ కళాశాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని హబ్ CEO జి. కృష్ణన్ వెల్లడించారు. వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నాలజీ ప్రదర్శన ‘ఇన్నోవికాస్-2025’ రెండో రోజు కొనసాగింది. సస్టైనబుల్ అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా విద్యార్థులు రూపొందించిన కొత్త ఆలోచనలు, నమూనాలను హబ్ ద్వారా సాంకేతికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
News December 30, 2025
నిబంధనలు పాటించాలి: ఎస్పీ విద్యాసాగర్

కృష్ణా జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో అశాంతి, మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్, డీజేలు, చట్టవిరుద్ధ కార్యక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసు తనిఖీలు, పికెట్లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.
News December 30, 2025
పరిశ్రమల స్థాపనే లక్ష్యం: కలెక్టర్ బాలాజీ

పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు పొందిన యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కానూరులో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, సాధ్యమైన వాటిని తక్షణమే పరిష్కరించారు. పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందించి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.


