News October 5, 2025
గుడివాడలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు గేటు వద్ద లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడలోని కాకర్ల వీధికి చెందిన సూర్యారావు చిన్నఎరుకపాడు నుంచి స్వగృహానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో అతన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 12, 2026
Way2 ఎఫెక్ట్.. యానాది కుటుంబాలకు విముక్తి

నాగయలంక మండలం ఈలచెట్లదిబ్బలో యానాది కుటుంబాలతో వెట్టిచాకిరి చేపిస్తున్న ఘటనపై Way2Newsలో ‘<<19085249>>మాకు విముక్తి కల్పించండి సార్<<>>’ అనే వార్త పబ్లిష్ అయ్యింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేసి 27 యానాది సంచార కుటుంబాలను పరిశీలించగా, 11 కుటుంబాలకు విముక్తి కల్పించి స్వగ్రామాలకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న దళారులను పోలీసులు అడ్డుకున్నారు. మిగిలిన 16 కుటుంబాలు ఇక్కడే ఉంటామని తెలిపాయి.
News February 11, 2026
రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతే లక్ష్యం: కలెక్టర్

మచిలీపట్నంలోని ‘మీ కోసం’ వేదికగా కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో రెవెన్యూ అధికారుల సమగ్ర సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించి, ప్రజలకు మరింత జవాబుదారీగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 22-ఏ వివాదాల పరిష్కారం, భూ రీ-సర్వే, ఈ-కేవైసీ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బాధితుల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు.
News February 11, 2026
కృష్ణా: కొల్లు రవీంద్రకు బెదిరింపు లేఖ.. కార్యకర్తల ఆందోళన!

మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్రలకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రకు ముప్పు పొంచి ఉందన్న వార్తతో మచిలీపట్నం టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న రవీంద్రకు ఇటువంటి హెచ్చరికలు రావడంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ భద్రత పెంచాలని కోరుతున్నారు.


