News February 4, 2025
గుడివాడ: లారీ ఢీకొని వ్యక్తి గుర్తుతెలియని మృతి
గుడివాడ మార్కెట్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. ఏలూరు రోడ్‌లో నుంచి పామర్రు రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ మార్కెట్ సెంటర్లోని కటారి సత్యనారాయణ చౌకు వద్ద మలుపులో సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 4, 2025
కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ మంగళవారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12, 14, 17, 19 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News February 4, 2025
గన్నవరం: ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి
గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు… సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
News February 4, 2025
ఆ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
జిల్లాలో SC, ST కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పౌర హక్కుల రక్షణ, అట్రాసిటీ నివారణ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును కమిటీ సభ్యులతో చర్చించారు.