News March 11, 2025

గుడిహత్నూర్‌లో శిశువు మృతదేహం కలకలం

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామ శివారులోని వాగులో మంగళవారం ఉదయం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

Similar News

News March 12, 2025

గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

బజార్హత్నూర్‌కు చెందిన బిట్లింగ్ లక్ష్మణ్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ 404 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి తమ ప్రతిభ కనబర్చారు. ఉదయ్ పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ అధికారి, వీఆర్వో, గ్రూప్ -4, సింగరేణి (ఎస్‌సీ‌సీ‌ఎల్ )జాబ్ సంపాదించి మరోపక్క గ్రూప్‌2కు సన్నద్ధమయ్యాడు. మంగళవారం వెలువడిన గ్రూప్‌2 ఫలితాల్లో ఉద్యోగం సాధించడం పట్ల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News March 12, 2025

ఆదిలాబాద్: ఏసీబీ రైడ్ UPDATE

image

ADBలో ACB దాడుల్లో అవినీతి అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్ భవనానికి రూ.2 కోట్లు మంజూరైతే ఒక శాతం లంచం ఇవ్వాలని ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా శంకర్‌ను పట్టుకొని కరీంనగర్ కోర్టులు హాజరుపర్చారు.

News March 12, 2025

అట్టుడుకుతున్న ADB.. 40డిగ్రీల టెంపరేచర్

image

వేసవి ప్రారంభం ముందే ఆదిలాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతోంది. జిల్లాలో నిత్యం 39డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దయిన గాదిగూడ మండలంలో మంగళవారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా పక్క మండలమైన నార్నూర్‌లో 39డిగ్రీలు నమోదైంది. ఉదయం 10 నుంచే వేడిమి పెరగడంతో బయటకు వెళ్లలేకపోతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

error: Content is protected !!